ఇండియా జపాన్ ఇన్నోవేషన్ రీజినల్ హ్యాకథాన్

20-09-2026 | 05:10am
  1. ఎంఎల్‌ఆర్‌ఐటీఎంలో ఘనంగా నిర్వహణ
  2. విద్యార్థుల్లో సాంకేతిక ఆవిష్కరణలకు ప్రోత్సాహం

హైదరాబాద్, సెప్టెంబర్ (విజయక్రాంతి): దుండిగల్‌(Dundigal)లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇనిస్టిట్యూ ట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్(Marri Laxman Reddy Institute of Technology and Management)(ఎంఎల్‌ఆర్‌ఐటీఎం) ఆధ్వర్యంలో ఇండియా జపాన్ ఇన్నోవేషన్ రీజినల్ హ్యాకథాన్(India-Japan Innovation Regional Hackathon) 2026ను ఘనంగా నిర్వహించారు. 12 గంటల పాటు జరిగిన ఈ ఇంటర్ -కాలేజీ హ్యాకథాన్‌లో విద్యార్థులు(Students) వాస్తవ ప్రపంచ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను రూపొందిస్తూ తమ ప్రతిభను ప్రదర్శించారు. హ్యాకథాన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఐఓటీ, సెమీకండక్టర్ టెక్నాలజీ, స్మార్ట్ మొబిలిటీ, ఇండస్ట్రీ 4.0 వంటి ఆధునిక సాంకేతిక రంగాలపై దృష్టి సారించారు.

విద్యార్థులకు పరిశ్రమ నిపుణులతో మమేకమై ఇన్నోవేషన్, టెక్నాలజీ, ఎంట్రప్రెన్యూర్‌షిప్‌పై అవగాహన పొం దే అవకాశం లభించింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులు తోషిబా ఇండియా ప్రైవే ట్ లిమిటెడ్ సీఎండీ హిరోషి ఫురుటా, టీసీఎస్ సీఐవో అండ్ ఐఈఈఈ హైదరాబాద్ వైస్ చైర్ బాలప్రసాదర్ పెడ్డి, జేపీ మోర్గాన్ వైస్ ప్రెసిడెంట్ గురుప్రీత్‌సింగ్, ర జపాన్ హబ్ ఫౌండర్ బి.రామభద్ర, అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఏఎల్‌ఈఏపీ చీఫ్ ఇన్నోవేష న్ ఆఫీసర్ డాక్టర్ జహూరుల్లా ఎస్‌ఎండీ(డా.బెడ్) పాల్గొని విద్యార్థులను ప్రోత్స హించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, ఫౌండర్ సెక్రటరీ, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అను శ్రేయరెడ్డి, మర్రి ధీరన్‌రెడ్డి, ట్రె జరర్ మర్రి మమతారెడ్డి, కార్యక్రమ నిర్వాహకులు, విద్యార్థులు, మెంటర్లు, భాగస్వా మ్య సంస్థలను అభినందించారు. డైరెక్టర్ డాక్టర్ పి.శ్రీధర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. ము రళీ ప్రసాద్ పాల్గొన్న విద్యార్థులు, ఫ్యాకల్టీ, నిర్వాహకులను అభినందించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో డాక్టర్ ఎస్.పి. జానీ, నిర్వాహక బృందం చేసిన కృషిని ప్రశంసించారు. ఇండియాజపాన్ ఇన్నోవేషన్ రీజినల్ హ్యాకథాన్ ద్వారా అకాడెమియా, పరిశ్రమ మరియు ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఒకే వేదికపైకి వచ్చాయి. విద్యార్థుల్లో ‘ఆలోచించండి’, ‘సృష్టించండి’ ‘సహకరించండి’ ‘ఆవిష్కరించండి’  స్ఫూర్తిని పెంపొందిస్తూ, ఇన్నోవేషన్, పరిశోధన, ఎంటర్ప్రెన్యూర్షిప్, అంతర్జాతీయ సహకారాన్ని కళాశాల ప్రోత్సహిస్తోందని నిర్వాహ కులు తెలిపారు. 

మరిన్ని వార్తలు