GST Council భేటీపై హైప్.. అందరి చూపు అటువైపే!

08-10-2026 | 02:19pm

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా GSTకి సంబంధించిన కీలక అంశాలపై మరోసారి ఫోకస్ పెరిగింది. కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అధ్యక్షతన న్యూఢిల్లీలో GST Council 57వ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి కేంద్రం, రాష్ట్రాల నుంచి కీలక ప్రతినిధులు హాజరయ్యారు. ఈ GST Council Meeting 2026లో ఢిల్లీ, గోవా, హర్యానా, జమ్మూకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మేఘాలయ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. అలాగే మణిపూర్, తెలంగాణ డిప్యూటీ సీఎంలు కూడా సమావేశానికి హాజరయ్యారు. దీంతో GST Latest Newsపై ఆసక్తి మరింత పెరిగింది.

రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రెవెన్యూ శాఖ కార్యదర్శితో పాటు CBIC చైర్మన్, సభ్యులు, ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా సమావేశంలో భాగమయ్యారు. దేశ ఆర్థిక వ్యవస్థలో Goods and Services Tax (GST) కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో ఈ GST Council 57th Meeting ప్రాధాన్యత సంతరించుకుంది. కేంద్రం, రాష్ట్రాల మధ్య GSTకి సంబంధించిన అంశాలు, పన్నుల వ్యవస్థ, ఆదాయానికి సంబంధించిన విషయాలపై కౌన్సిల్‌లో చర్చలు జరిగే అవకాశం ఉంది.

ముఖ్యంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు ఒకే వేదికపైకి రావడంతో ఈ GST Council Meetingపై రాజకీయ, ఆర్థిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయి? GST Rules 2026, పన్ను విధానంలో ఏమైనా కీలక మార్పులు ఉంటాయా? అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి Nirmala Sitharaman అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీ ముగిసిన తర్వాతే చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో GST Council Latest Updates కోసం వ్యాపార వర్గాలు, పన్ను చెల్లింపుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు