బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. ఒక్కరోజే
పసిడి ధరలు (Gold Prices) మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు (International Market Trends), దేశీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో బంగారం ధరలు (Gold Rates) పైపైకి ఎగబాకుతున్నాయి. తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై ఏకంగా రూ.1,030 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,44,600కు చేరుకుంది.
మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరిగింది. 10 గ్రాములపై రూ.950 పెరగడంతో ధర రూ.1,32,550కు చేరింది. దీంతో పసిడి కొనుగోలు చేయాలనుకునే సామాన్యులకు ధరల పెరుగుదల భారంగా మారుతోంది. పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నవారు (Gold Buyers) ధరల పెరుగుదలతో ఆందోళన చెందుతున్నారు. అటు వెండి ధరలు (Silver Rates) కూడా భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.05 లక్షలుగా నమోదైంది.