ఘనంగా కొమరం భీమ్ జయంతి
22-10-2026 | 10:04pm
దమ్మపేట,(విజయక్రాంతి): ఆదివాసి హక్కుల పోరాట యోధుడు కోమరం భీమ్ 125 వ జయంతి(Komaram Bheem 125th Jayanti) సందర్భంగా గురువారం బిఆర్ఎస్ పార్టీ(BRS Party) జిల్లా నాయకులు సోయం వీరభద్రం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ప్రక్కన గల కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోమరం భీమ్ పోరాటo జల్- జoగిల్- జమీన్ నినాదంతో నిజాం నిరంకుశత్వ పాలన కి వ్యతి రేకoగా యుద్దభూమిలో అసువులు భాసి అమరుడు అయ్యాడని వారి పోరాటాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి నాయకులు తంబల్ల రవి, సోయం వెంకన్నబాబు, వాడే వీరస్వామి తధితరులు పాల్గొన్నారు.