అక్రమంగా కలప తరలిస్తున్న వాహనాలు సీజ్
దమ్మపేట, అక్టోబర్ 27 (విజయక్రాంతి): దమ్మపేట రేంజ్(Dammapeta Range) పరిధిలోని ముష్టి బండ బీట్, గణేష్‌పాడు ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న ఫైర్వుడ్ లారీని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సదరు లారీలో ఇరవై ఆరు వేల 813 రూపాయల విలువగల సుమారు 5.5 టన్నుల ఫైర్వుడ్ ను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. అదేవిధంగా అచ్యుతాపురం బీట్ పరిధిలోని చీపురుగూడెం ప్రాంతంలో అక్రమంగా ఫైర్వుడ్ తరలిస్తున్న ట్రాక్టర్‌ను అటవీ శాఖ అధికారులు పట్టుకుని సీజ్ చేశారు.
ఈ ట్రాక్టర్‌లో పదిహేడు వేల రూపాయల విలువైన సుమారు 4.5 టన్నుల కలప ఉన్నట్లు గుర్తించారు. ఈ రెండు ఘటనల్లో మొత్తం సుమారు 9 టన్నుల ఫైర్వుడ్ ను తరలిస్తున్న రెండు వాహనాలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, కేసులు నమోదు చేశారు. అనంతరం వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. అటవీ సంపదను అక్రమంగా తరలించడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై అటవీ శాఖ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని దమ్మపేట ఫారెస్ట్ రేంజ్ అధికారి తెలిపారు.