శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు

17-10-2026 | 07:22pm

దమ్మపేట, అక్టోబర్ 17(విజయక్రాంతి): మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ సెంటర్ లో నిర్వహిస్తున్న శ్రీ దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు(Sri Devi Sharannavaratri Celebrations) వైభవంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజైన శనివారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవి అవతారంలో భక్తులకు(devotees) దర్శనమిచ్చారు. ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి దేవి సంపద, ఐశ్వర్యం, సౌభాగ్యం, సుఖసంతోషాలకు ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు.

అమ్మవారి అనుగ్రహంతో కుటుంబాల్లో సుఖశాంతులు, సిరిసంపదలు కలగాలని భక్తులు ప్రార్థించారు.  యర్నగూడెం వేంకటేశ్వరస్వామి గానామృత భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వర స్వామి కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ సభ్యుల పర్యవేక్షణలో విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు