డా. వరప్రసాదరావు కి రాష్ట్ర పదవి
బెల సెప్టెంబరర్ 18 (విజయక్రాంతి): నిస్వార్ధ సమాజ సేవలో గత 10 సంవత్సరాలనుండి ముందుకు వెళ్తున్న డా. వరప్రసాద్(Dr. Varaprasada Rao)కి భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గుర్తింపు పొందిన స్వచ్చంద సంస్థ "జాతీయ మానవ హక్కులు, మరియు నేర నియంత్రణ మండలి "తెలంగాణ రాష్ట్ర చైర్మన్" పదవి ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా డా. వేముగంటి వరప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికే వివిధ స్వచ్చంద సంస్థల నుండి ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేకుండా పూర్తి అవినీతి రహిత సేవ చేస్తున్న నాకు రాష్ట్ర గుర్తింపు రావడం గొప్ప బాధ్యత అని తన వంతుగా తప్పకుండా సేవలు అందిస్తా అని అన్నారు.
ఈ సంస్థ ముఖ్య ఉదేశ్యం నేరాలు జరగకుండా కట్టడి చేయడం అలానే మానవ హక్కల రక్షణ.. ఈ పదవి పూర్తి సేవా భావం తప్ప ఉద్యోగం కాదని స్పష్టం చేసారు. కాగా ఉత్తర తెలంగాణా లో అతి అరుదు అయిన ఉన్నత విద్యా డిగ్రీ లు కలిగి ఉన్న రావు.. తన వృత్తి అయిన ప్రిన్సిపాల్ గా సేవలు అందిస్తూ ప్రవృతి గా సేవ పదవుల లో కొనసాతూ ఉన్నారు. డా వేముగంటి ఆదిలాబాద్ జిల్లా బేల కీర్తన డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ గా ఉన్నారు. తన స్వగ్రామం కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలము తాడికల్ గ్రామము.