నైజాం పాలనను ఎదిరించిన పండుగ సాయన్న
బోథ్, అక్టోబర్ 21 (విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన పండుగ సాయన్న నేటి సమాజానికి ఆదర్శప్రాయుడని ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు, గౌరవ అధ్యక్షుడు భోజరాజులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పండుగ సాయన్న జయంతి వేడుకల్లో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముదిరాజ్ ముద్దుబిడ్డ పండుగ సాయన్న తన ధైర్యసాహసాలతో నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించారని పేర్కొన్నారు. ఆయన జీవితం నేటి సమాజానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆత్మగౌరవం, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం మాజీ అధ్యక్షుడు సున్నపు శ్రీనివాస్, జెట్టి రాజేశ్వర్, ప్రధాన కార్యదర్శి నాయుడు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.