మంథనిలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ నూతన కమిటీ ఎన్నిక
నూతన కమిటీ సభ్యులను అభినందించిన గట్టు నారాయణ గురూజీ, హరిబాబు
మంథని, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): మంథని పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయానికి నూతన కమిటీని నియమించారు. ఆలయ నిర్వహణ, భక్తులకు సేవలు, దేవాలయ అభివృద్ధి లక్ష్యంగా నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు ఆలయ అర్చకులు రామడుగు సాయి శ్రీనివాస్ తెలిపారు. నూతన కమిటీ అధ్యక్షురాలిగా మహావాది జలజ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా పనకంటి మురళీధర్ రావు,
కోశాధికారిగా మహావాది సతీష్ కుమార్ ఎన్నికయ్యారు. భజన మండలి కన్వీనర్‌గా సిద్ధాంత లక్ష్మి శ్రీనివాస్, సహ కన్వీనర్‌గా పద్మజ పురుషోత్తమరావు, సేవా కన్వీనర్లుగా శ్యామల రమేష్, వడ్లకొండ సత్యనారాయణ నియమితులయ్యారు. ప్రచార కన్వీనర్లుగా కడియాల రాజన్న, భువనగిరి రమేష్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులుగా సజ్జనపు శ్యాం, సాయిని కృష్ణమూర్తికి బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా శ్రీ సీతారామ సేవా సదన్ వ్యవస్థాపకులు గట్టు నారాయణ గురూజీ, సదన్ అధ్యక్షులు కె.వి.ఎల్.ఎన్. హరిబాబు నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయ అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు నూతన కమిటీ సభ్యులు సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు.
నూతన కమిటీ నియామకంతో ఆలయంలో భక్తి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించేందుకు అవకాశం ఏర్పడుతుందని భక్తులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.