పంటల వైవిద్వీకరణపై సూచనలు
- రైతు నేస్తం కార్యక్రమంపై రైతులకు అవగాహన
కొండపాక,(విజయక్రాంతి): కొండపాక మండలంలోని దుద్దెడ, కొండపాక రైతు వేదికల్లో గురువారం రైతు నేస్తం 111వ ఎపిసోడ్ ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) పత్తి కనీస మద్దతు ధర కొనుగోళ్లు, ఖేత్ బచావో అభియాన్(Khet Bachao Abhiyaan)ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎల్నినో ప్రభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు, సమతుల్య ఎరువుల వినియోగం, ప్రకృతి వ్యవసాయం, పంటల వైవిధ్యీకరణ వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయంలో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను పాటిస్తూ, నేల సారాన్ని కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు, సర్పంచులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.