పౌర హక్కులను కాపాడుకోవాలి...

30-09-2026 | 05:48pm

డీవీఎంసీ మెంబెర్  లక్ష్మీకాంత్..

ఉట్నూర్, సెప్టెంబర్ 30 ( విజయక్రాంతి ): ప్రతి ఒక్కరికి ఉన్న పౌర హక్కులను కాపాడవలసిన బాధ్యత  ప్రతి ఒక్కరిపై ఉందని  డివిఎంసి  మెంబర్ లక్ష్మీకాంత్(DVMC Member Laxmikant) అన్నారు. బుధవారం ఇంద్రవెల్లి  మండలంలోనిమండలం సమక గ్రామ పంచాయతీ పాటగూడ లో మండల తహసీల్దార్ ప్రవీణ్  కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పౌర హక్కుల దినోత్సవం లొ ముఖ్య అతిథి గా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీవీఎంసీ మెంబెర్ లక్ష్మీకాంత్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి పై జరుగుతున్న అఘాయిత్యాలను, భూ అక్రమనలను నీవరించడానికి అట్రాసిటీ చట్టం ఆయుధం  లాంటిదని, ఈ చట్టాన్ని అందరు తెలుసు కోవడంతోపాటు తమ హక్కులను కాపాడు కోవాలన్నారు. కుల వివక్ష,అస్పృష్యత నివారణలో అన్ని కులాల వారు తొడ్పాటు అందించాలని కోరారు.కార్యక్రమం లొ సమక సర్పంచ్ రాజేశ్వర్, ఎంపీడీఓ మహేందర్, ASI నాగేశ్వర్, SW వార్డెన్ రవీందర్, AEO శ్రవ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు