ఎత్మసూర్ దేవత ఉత్సవాల పోస్టర్ల విడుదల..

28-10-2026 | 04:10pm

ఉట్నూర్,అక్టోబర్28 ( విజయక్రాంతి ): దీపావళి పండుగ సందర్భంగా  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు ఘనంగా నిర్వహించే దండారి ఉత్సవాల  పోస్టర్లను(Dandari Utsavalu Posters) ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో(Utnoor ITDA Office) బుధవారం సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఉట్నూర్ ఐ టి డి ఏ ప్రాజెక్టు అధికారి మందమకరందు చేతుల మీదుగా  ఆవిష్కరించారు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడి రేవు సమీపంలోని పద్మల్ పూరికాకో దేవస్థానం లో నవంబర్ 5 న నిర్వహించే దర్బార్, ఉత్సవాల పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మల్ పూర్ కాకు ఆలయంలో నవంబర్ 1నుంచి 12 వరకు గుస్సాడి దండారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

గొండ్వాన భూభాగంలో అత్యంత పవిత్రమైనటువంటి ఎత్మ సార్ ఉత్సవాలు గుసాడి పద్మలపురి కాకో దేవత ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది పేర్కొన్నారు. తీర్చవాలకు ప్రజలునాయకులు, భారీ ఎత్తున్న హాజరు కావాలని కోరారు. పోస్టర్ల విడుదల కార్యక్రమంలో పద్మ పూరి కాకో వైస్ చైర్మన్, కుమ్ర లింగారావ్,  రాజ్ గోండు సేవా సమితి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావు, 

రాజ్ గోండు సేవ సమితి, తొడాసం భీం రావు, రాష్ట్ర నాయకులు, ఆత్రం రాజేశ్వర్, నిర్మల్ జిల్లా అధ్యక్షులు, ఆత్రం భగవంత్ రావు,రాజ్ విద్యార్థి సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షులు,పెంధోర్ శ్రీనివాస్, ఆత్రం జలపాత్ పటేల్ ఆదివాసి సేన మండల అధ్యక్షులు, పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు