చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతానికి కార్యాచరణపై చర్చించిన ఎమ్మెల్యే...
28-10-2026 | 04:26pm
ఉట్నూర్, అక్టోబర్ 28( విజయక్రాంతి ): నవంబర్ 1న న్యూఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న “ఓట్ బచావో – దేశ్ బచావో”(Save the Vote – Save the Nation) జాతీయ ర్యాలీ నేపథ్యంలో ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్ ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల ముఖ్య నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం కార్యక్రమాలపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.