బేలలో పోలీసు అమరవీరులకు ఘన నివాళి

22-10-2026 | 09:56pm

బేల, అక్టోబర్ 22 (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బేల పోలీసు శాఖ(Bela Police Department) ఆధ్వర్యంలో గురువారం రాత్రి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బేల పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీ అంబేడ్కర్ చౌక్‌కు చేరుకుంది.

ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ, ప్రజల భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీఐ శ్రవణకుమార్, ఎస్ఐ మధుకృష్ణ, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు