మండలం లో బతుకమ్మల నిమజ్జన వేడుకలు

22-10-2026 | 08:39pm

తలమడుగు అక్టోబర్ 22 (విజయక్రాంతి): మండలంలోని సుంకిడి, కూచులపూర్, ఖోడద్ గ్రామాల్లో బతుకమ్మ పండుగ(Bathukamma Festival) సందర్భంగా మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలను ఎత్తుకొని గ్రామాల్లో శోభాయాత్ర నిర్వహించారు. సంప్రదాయ పాటలు పాడుతూ, ఆటపాటలతో సందడి చేశారు. అనంతరం సమీపంలోని వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేసి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

మరిన్ని వార్తలు