సదర్ ఉత్సవాల్లో పాల్గొన్న ఆత్మ చైర్మన్
04-11-2026 | 08:09pm
బోథ్. నవంబర్ 4 (విజయ క్రాంతి): హైదరాబాదులో జరిగిన సదర్ ఉత్సవాల్లో(Sadar Utsav) బోత్ ఆత్మ చైర్మన్ రాజు యాదవ్ పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యుడు మండాది అనిల్ కుమార్ యాదవ్ తో(Rajya Sabha Member Mandadi Anil Kumar Yadav) మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల ప్రాధాన్యత యాదవ సామాజిక వర్గ సాంప్రదాయాలు ఐక్యత సామాజిక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. ఇలాంటి వేడుకలను భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహిస్తామని రాజ్యసభ సభ్యులు పేర్కొనడం జరిగిందని ఆత్మ చైర్మన్ తెలిపారు.