రాష్ట్ర కబడ్డీ పోటీల్లో యాదాద్రి బాలికల జట్టు ఘన విజయం
ఆలేరు, అక్టోబర్ 3 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) వేములవాడలో ఈ నెల 2, 3, 4, 5 తేదీల్లో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా బాలికల జట్టు విజయం(Yadadri Bhuvanagiri Girls Win)తో శుభారంభం చేసింది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో భూపాలపల్లి జిల్లా జట్టుపై యాదాద్రి భువనగిరి బాలికల జట్టు 41–29 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై 12 పాయింట్ల ఆధిక్యంతో విజయం నమోదు చేసి తదుపరి మ్యాచ్‌కు దూసుకెళ్లింది.
ఈ జట్టుకు కోచ్‌గా మంగళగిరి నరేష్, మేనేజర్‌గా రాకేష్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పూల నాగయ్య, కోశాధికారి గంధమాల కుమార్, టెక్నికల్ కమిటీ చైర్మన్ చిందం విజయ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయులు పూల చంద్రకుమార్, యాట సందీప్, రేఖశ్రీ పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి బాలికల జట్టు తొలి మ్యాచ్‌లోనే విజయం సాధించడంతో జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేశారు.