బానోతు నాగులు ఆరోపణలను తీవ్రంగా ఖండించిన

03-10-2026 | 11:57pm

 దరూరి యోగానందాచార్యులు

తన భూమిపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),అక్టోబర్ 3: సెప్టెంబర్ 28న మేడిబాయి తండాకు(Medibai Thanda) చెందిన రైతు బానోతు నాగులు(Farmer Banothu Nagulu),పీఏసీఎస్ చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డితో(Kuntla Surender Reddy) కలిసి తనపై,తన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దరూరి యోగానందాచార్యులు(Daruri Yoganandacharyulu) శనివారం తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008లో నల్లు లీల,ఆమె భర్త రవీందర్ రెడ్డి వద్ద నుంచి 14.13 ఎకరాల భూమిని కొనుగోలు చేసేందుకు మందడి పూర్ణచందర్ రెడ్డి మధ్యవర్తిత్వంతో డబ్బులు చెల్లించినట్లు తెలిపారు.

నల్లు లీల నుంచి 10.31 ఎకరాలు,లష్కర్,కిషన్‌ల నుంచి 3.21 ఎకరాలు తన భార్యకు,తన బావమరిది గిరిప్రసాద్‌కు రిజిస్ట్రేషన్ చేసినట్లు వివరించారు.అప్పటి నుంచి ఆ భూమి తమ ఆధీనంలోనే ఉందని,రైతుల సమక్షంలోనే భూమిని సాగు చేయిస్తున్నామని తెలిపారు.రాజకీయ కక్షతో తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని యోగానందాచార్యులు ఆరోపించారు.కొమ్మాల రెవెన్యూ పరిధిలోని తన భూమికి సంబంధించి సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు.

తన వద్ద కమిషన్ తీసుకుని 14.13 ఎకరాలకు డబ్బులు చెల్లించించిన పూర్ణచందర్ రెడ్డి ప్రస్తుతం అదే భూమిపై ఆరోపణలు చేస్తున్నారని,తాను కొనుగోలు చేసిన భూమిని కొలిచి అప్పగించాలని,లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు అనిరెడ్డి రాజేందర్ రెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ ఉపాధక్షలు నర్సింగ శ్రీనివాస్ గౌడ్,మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోరపాక సత్యం,సర్పంచులు కుంటిగొర్ల శ్రీనివాస్,బింగి కృష్ణమూర్తి,రైతులు,నాయకులు,కార్యకర్తలు,గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు