వలస ఆదివాసీల స్థితిగతులపై బీజాపూర్ ఎమ్మెల్యే పర్యటన
మూడు రోజుల పాటు ఏజెన్సీ ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన
వెంకటాపురం, నూగూరు అక్టోబర్ 3 (విజయ క్రాంతి) : చత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో(Mulugu and Bhadradri Kothagudem districts) నివసిస్తున్న ఆదివాసీలు(Adivasis), కూలీల స్థితిగతులు, వారికి అందుతున్న పౌర సౌకర్యాలను పరిశీలించేందుకు బీజాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే విక్రమ్ మండవి(Bijapur Congress MLA Vikram Mandavi) మూడు రోజుల పర్యటన చేపట్టారు. శనివారం సాయంత్రం వెంకటాపురం చేరుకున్న ఆయనకు మండల కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్ నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వలస వచ్చిన ప్రజల నివాసాలు, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు
భూమి హక్కులు, ఓటు హక్కు, ఎస్ఐర్ ప్రక్రియకు సంబంధించిన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. చర్ల, కొయ్యూరు, ఆలుబాక, వెంకటాపురం, వాజేడు తదితర ప్రాంతాల్లో పర్యటించి వలస గిరిజనుల వివరాలు సేకరించనున్నట్లు చెప్పారు. వారి సమస్యలను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లి, తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి పౌర సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు.ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో వెంకటాపురం పోలీసులు కాన్వాయ్కు బందోబస్తు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సయ్యద్ హుస్సేన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చిడెం శివ, ములుగు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ధణపనేని వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ పార్టీఅధ్యక్షు చిట్టెం సాయి సర్పంచులు తాటి సరస్వతి, కొండపర్తి సీతాదేవిసత్యవతి, ఉపసర్పంచ్ సర్ఫద్దిన్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పర్యటన నేపథ్యంలో వెంకటాపురం పోలీసులు కాన్వాయ్కు బందోబస్తు నిర్వహించారు.