యాదగిరిగుట్ట ఆర్టీసీ ఆన్ లైన్ లో బుకింగ్ సదుపాయం
దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణికుల కోసం ఆన్ లైన్ బుకింగ్
డిపో మేనేజర్ కే సురేష్
యాదగిరిగుట్ట, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : యాదగిరిగుట్ట నుండి శ్రీశైలం, రాయచూర్ దూర ప్రాంత వెళ్లే ప్రయాణికుల కోసం టీఎస్ ఆర్టీసీ ఆన్ లైన్ సదుపాయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కె సురేష్ తెలిపారు. శనివారం ఒక ప్రకటనలో ఆయన తెలియజేస్తూ యాదగిరిగుట్ట నుండి శ్రీశైలం కు డీలక్స్ బస్సు నడుపుతున్నామని ఉదయం 6 గంటలకు యాదగిరిగుట్ట డిపో నుండి బయలుదేరి, 06.20 భువనగిరి, 06.45 ఘటకేసర్, 07.15 నిముషాలకు ఉప్పల్/నల్లచెరువు, మహాత్మా గాంధీ బస్ స్టాండ్ నుండి శ్రీశైలం కు సర్వీసు రిజర్వేషన్ నెం.1915 ద్వారా బుక్ చేసుకోవచ్చున ని, శ్రీశైలం నుండి సాయంత్రం 15.45 నిముషాలకు బయలుదేరి యాదగిరిగుట్ట కు రాత్రికి వస్తుందని, అదే విధంగా యాదగిరిగుట్ట నుండి రాయచూర్ కు 12.30, 15.00, 15.45, 16.30, 17.00 గంటలకు డీలక్స్ బస్సులు నడుపుతున్నామని ప్రతి డీలక్స్ బస్సు భువనగిరి, ఘట్కేసర్, ఉప్పల్, హైదరాబాద్, మహబూబ్ నగర్, మక్తల్ ద్వారా రాయచూర్ వెళ్లి మరుసటి రోజు యాదగిరిగుట్ట కి వచ్చున ని . ఈ బస్సుల ఆన్ లైన్ రిజర్వేషన్ రిజర్వ్ చేసేందుకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9063404773 సంప్రదించగలరని అని డిపో మేనేజర్ తెలియజేసారు.