ఆసరా పింఛన్ దరఖాస్తుల పరిశీలన...
24-09-2026 | 05:06pm
అర్హులైన వారికి పింఛన్ల మంజూరు... సర్పంచ్ ఆనంద నాయక్.
తాండూరు, సెప్టెంబర్ 24, (విజయ క్రాంతి): అర్హులైన వారికి ఆసరా పింఛన్లు(Aasara pension) మంజూరు చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా పెద్దెముల మండలం కందనెల్లి తండా సర్పంచ్ ఆనంద్ నాయక్(Kandanelli Thanda Sarpanch Anand Naik) అన్నారు. బుధవారం ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను డిప్యూటీ తాసిల్దార్ శ్రీనివాసులు, గ్రామ పంచాయితీ ఇన్చార్జి కార్యదర్శి పరమేష్ తో కలిసి ఇంటింటికి వెళ్లి దస్త్రాలను పరిశీలించారు. .