అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి
ఎర్రుపాలెం అక్టోబర్ 22 (విజయక్రాంతి): ఇందిరమ్మ ఇల్లు అర్హులైన పేద బలహీన వర్గాలకు ఇవ్వాలని ఇందిరమ్మ కమిటీలను(Indiramma Committee) రద్దు చేయాలని టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నాడు ఖమ్మం కలెక్టరేట్(Khammam Collectorate) వద్ద ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు అర్హులైన పేదలకు ఇవ్వాలని కొంతమంది కాంగ్రెస్ నాయకులు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరితే మీకు ఇల్లు ఇస్తామని అనడం చాలా బాధాకరం గత బి ఆర్ ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను లాటరీ పద్ధతిలో పార్టీలకు అతీతంగా ఇవ్వడం జరిగినది.
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని లబ్ధిదారులను గుర్తించి లాటరీ పద్ధతిలో పార్టీలకు అతీతంగా ఇల్లు మంజూరు చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో శ్రీ పాలశెట్టి తిరుపతిరావు బొర్రా నరసింహారావు కోటా లోకేష్ మరియు మధిర మండల నాయకులు మధిర మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తార్ నాగేశ్వరావు కార్పొరేటర్ యానం శెట్టి అప్పారావు భాస్కర్ రెడ్డి వంకాయల పాట్టి నాగేశ్వరావు రాయబారపు పుల్లారావు కంచం గోపి బొగ్గుల వీరారెడ్డి ఆళ్ల నాగరాజు ముఖ్య నాయకులు ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు.