ఆక్రమణలు తొలగించకపోతే ఉద్యమం

22-10-2026 | 06:07pm

నిర్మల్ అక్టోబర్ 22 ( విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో కబ్జాకు గురైన భూములను ప్రభుత్వం కాపాడాలని అక్రమాలను వెంటనే కూల్చాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(Aam Aadmi Party District Convener Syed Haider) డిమాండ్ చేశారు.  పట్టణంలోని నిర్మల కోటలు కందకాలు జవులీనాల ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని అయినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని న్యాయం జరగకపోతే ప్రజా పోరాటం చేస్తామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు