ఘనంగా పండుగ సాయన్న జయంతి వేడుకలు
కొత్తగూడెం అక్టోబర్ 22 విజయ క్రాంతి: భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు(Bhadradri District SP Rohit Raju) ఐపీఎస్ ఆదేశాల మేరకు హేమచంద్రపురం పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో పండుగ సాయన్న ముదిరాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డిఎస్పి మాట్లాడుతూ, పండుగ సాయన్న ముదిరాజ్ ప్రజల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పోరాడిన ధైర్యవంతుడైన యోధుడని తెలిపారు. పేదలు, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు లాల్ బాబు, నరసింహారావు, కృష్ణారావు ఆర్ఎస్ఐలు హరీష్, శ్రీనివాస్, అధికారులు, సిబ్బంది పాల్గొని ఘన నివాళులర్పించారు.