రోడ్డుపై ఫ్లెక్సీ బోర్డు తలిగి వ్యక్తికి తీవ్ర గాయాలు
మెయిన్ రోడ్డుపై ఫ్లెక్సీలతో వివాహనదారులకు తీవ్ర ఇబ్బందులు..
ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన పట్టించుకోని అధికారులు..
యాదగిరిగుట్ట, అక్టోబర్ 27 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట(Yadagirigutta) మెయిన్ రోడ్డు మున్సిపల్ కార్యాలయం ముందు కరెంటు స్తంభానికి కట్టిన ఫ్లెక్సీ వాహనదారుడికి తలపై పడి తలకు తీవ్ర గాయం అయిన ఘటన చోటుచేసుకుంది. మంగళవారం యాదగిరిగుట్టకు చెందిన బింగి పాండు ఉదయం తన షాప్ వద్దకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనం పైన వస్తుండగా మెయిన్ రోడ్డు మున్సిపల్ కార్యాలయం వద్ద స్తంభానికి కట్టిన ఇనుప ఫ్లెక్సీ స్టాండ్ గాలికి పడడంతో వాహనంపైన ఉన్న బింగి పాండు తలకి తీవ్ర గాయం అయింది.
ఆయనను స్థానికులు హాస్పిటల్ కు తరలించగా, డాక్టర్ 8 కుట్లు వేశారు, 24 గంటల తర్వాతనే ఏదైనా చెబుతామని డాక్టర్ తెలిపారని బింగి పాండు తెలిపారు. అనంతరం తనకు జరిగిన ఘటనపై మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చి ఫిర్యాదు చేసినట్లు బింగి పాండు తెలిపారు.
యాదగిరిగుట్టలో ఈ మధ్య కాలంలో వివిధ పార్టీలకు చెందిన వాళ్లు, స్థానికులు పండుగలు ఇతర కార్యక్రమాలకు మెయిన్ రోడ్డు స్తంభాలకు ఫ్లెక్సీలను వేయడం జరుగుతుందని, ఈ ఫ్లెక్సీ బోర్డులతో స్థానికులకు, వాహనదారులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గతంలో పలుమాలు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు ఫ్లెక్సీల విషయంలో చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుండ్లపల్లి నుండి రాజగోపురం వరకు మెయిన్ రోడ్డు డివైడర్ మధ్యలోని స్తంభాలకు ఫ్లెక్సీలను కట్టకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.