ఎన్నెన్నో ప్రభావం పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్ర మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ
యాదగిరిగుట్ట అక్టోబర్ 25 (విజయక్రాంతి): పసిఫిక్ మహాసముద్రంలో(Pacific Ocean) ఏర్పడిన ఎల్ నీనో ప్రభావంతో(El Nino effect) ఎన్నో దేశాలకు కరువు, ఆర్థిక ప్రభావం పడిందని దేశం, రాష్ట్రంలోనూ ఎల్ నీనో ప్రభావం(El Niño effect) పడకుండా చూడాలని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని కోరుకుంటున్నట్లు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ(Errabelli Swarna) అన్నారు. ఆదివారం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ ఎల్ నీనో ప్రభావం పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతుందని ప్రజలు సహకరించాలని అన్నారు.
ప్రతిపక్షాలు ప్రభుత్వానికి అండగా నిలిచి ఎల్ నీనో ప్రభావం ప్రజలపై పడకుండా చూడాలని అన్నారు.రాష్ట్ర ప్రజలు ఎల్ నేను ప్రభావం ను అర్థం చేసుకోవాలని విద్యుత్తు నీరు పెట్రోలు ధనధాన్యాలను విచ్చలవిడిగా వాడకూడదని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ముఖ్యంగా విద్యుత్తు నీటిని పొదుపుగా వాడుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో మహిళలకు అన్ని రంగాలలో ప్రాధాన్యం పెరిగిందని, పార్టీలో పనిచేసే వారికి పదవులు వరిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో
యాదాద్రి భువనగిరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ. మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, జనగామ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా, స్టేట్ జనరల్ సెక్రెటరీ రజిత, సుధారాణి, కాలిలే లత, ఝాన్సీ, మమత,కవిత పాల్గొన్నారు.