సోలార్ ప్యానల్ తో విద్యుత్ బిల్లుల భారం తగ్గించొచ్చు

03-10-2026 | 10:48pm

భువనగిరి మున్సిపల్ చైర్పర్సన్ శ్రీవాణి

భువనగిరి, అక్టోబర్ 3 (విజయ క్రాంతి) : ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్యానళ్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్‌ బిల్లుల భారం తగ్గించొచ్చని భువనగిరి మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సేవా సేతు అభియాన్‌–పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజనపై భువనగిరి పట్టణంలో శనివారం విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులో మాట్లాడారు. అదనపు విద్యుత్‌ను గ్రిడ్‌కు అందించే అవకాశం ఉందన్నారు.

పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తోందని, రుణ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టణ ప్రజలు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యుత్‌ శాఖ అధికారులు, సోలార్‌ కంపెనీ ప్రతినిధులు దరఖాస్తు విధానం, సబ్సిడీ తదితర అంశాలను వివరించారు. కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్‌ తంగళ్లపల్లి రవికుమార్‌, మాజీ కౌన్సిలర్‌ కుక్కదువ్వ సోమయ్య, విద్యుత్‌ శాఖ ఏఈ, లైన్‌మెన్లు, స్థానిక నాయకులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు