హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్‌లో ప్రత్యేక సంరక్షణ

27-11-2026 | 05:05am

యశోద హాస్పిటల్స్‌లో నిర్వహణ  

ముకరంపుర, నవంబర్ 26(విజయక్రాంతి): సాధారణ, హై రిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణ, గైనకాలజికల్ సమస్యలకు ప్రత్యేక చికిత్స, అధునాతన లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీలతో సహా సమగ్ర ప్రసూతి, గైనకాలజీ సేవలను సోమాజిగూడ యశోద హాస్పిటల్(Yashoda Hospital) అందిస్తోంది. గురువారం కరీంనగర్ యశోద హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ గైనకాలజిస్ట్, లాపరోస్కోపిక్,రోబోటిక్ సర్జన్ డాక్టర్ పి అనూషరావు మాట్లాడుతూ సరైన వైద్య సలహాలు, ప్రసూతి సంరక్షణలో వచ్చిన ఆధునిక పురోగతితో ముందుగానే ఆరోగ్య సమస్యలు ఉన్న చాలామంది మహిళలు కూడా విజయవంతంగా గర్భం దాల్చి సురక్షితంగా ప్రసవించ గలరని అన్నారు.

తల్లి బిడ్డ ఇద్దరి ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రమాదాలను ముందే గుర్తించడం, గర్భం దాల్చడానికి ముందే ఉన్న ఆరోగ్య సమస్యలను నియంత్రణలోకి తెచ్చుకోవడం, గర్భధారణ కాలమంతా నిరంతర పర్యవేక్షణలో ఉండడం చాలా ముఖ్యమని ఆమె తెలిపారు. గైనకాలజీ సర్జరీలలో వచ్చిన ఆధునిక పురోగతి గురించి వివరిస్తూ వివిధ గైనకాలజికల్ సమస్యల చికిత్సలో లాపరోస్కోపీ, హిస్టెరోస్కోపీ మరియు రోబోట్ సహాయంతో చేసే శస్త్ర చికిత్సల పాత్ర పెరుగుతుందన్నారు. అలాగే గర్భాశయ ఫైబ్రాయిడ్లు, ఎండోమెట్రియోసిస్, ఒవేరియన్ సిస్ట్,అసాధారణ గర్భాశయ రక్తస్రావం వంటి సమస్యలకు సకాలంలో పరీక్షలు, వ్యక్తిగత అవసరాలకు తగిన ప్రత్యేక గైనకాలజికల్ చికిత్స ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు