చలిలోనూ ముఖం మెరవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
చలికాలం వచ్చిందంటే చర్మం పొడిబారడం, నిర్జీవంగా మారడం, దురద వంటి సమస్యలు వేధిస్తుంటాయి. చల్లని గాలులు, వాతావరణంలో తేమ తగ్గడం వల్ల చర్మంలోని సహజ తేమ తగ్గి ముఖం కాంతిహీనంగా కనిపిస్తుంది. అయితే కొన్ని చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా చలికాలంలోనూ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుకోవచ్చు (Winter Skin Care).
ముందుగా ప్రతిరోజూ తగినంత నీరు తాగాలి. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి మృదువైన ఫేస్‌వాష్ (Mild Face Wash) ఉపయోగించాలి. స్నానం చేసిన వెంటనే చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. దీనివల్ల చర్మంలో తేమ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది.
ఇవి కూడా చదవండి: చలికి జుట్టు డ్రై.. ఇలా చేయండి!
బయటకు వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ (Sunscreen) తప్పనిసరిగా ఉపయోగించాలి. చలికాలంలోనూ సూర్యకిరణాల నుంచి చర్మానికి హాని కలిగే అవకాశం ఉంటుంది. అలాగే పెదవులు పొడిబారకుండా లిప్‌బామ్ రాసుకోవాలి. వేడి నీటితో ఎక్కువసేపు స్నానం చేయడం తగ్గించాలి. ఎందుకంటే వేడినీరు చర్మంలోని సహజ నూనెలను తొలగించి పొడిబారేలా చేస్తుంది.
ఈ చిన్న జాగ్రత్తలను రోజువారీ అలవాట్లుగా మార్చుకుంటే చలికాలంలోనూ చర్మం తేమగా, మృదువుగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది (Glowing Skin).