బొగ్గు వెలికితీత నుండి రవాణా వరకు నాణ్యత ప్రమాణాలు పాటించాలి
- ఇంచార్జి జీఎం డి శ్యామ్ సుందర్
- ఘనంగా బొగ్గు నాణ్యత వారోత్సవాలు ప్రారంభం
భూపాలపల్లి టౌన్, నవంబర్ 12 ( విజయ క్రాంతి ) : సింగరేణి భూపాలపల్లి ఏరియాలో(Singareni Bhupalpalli Area) బొగ్గు వెలికితీత నుండి రవాణా వరకు ప్రతి దశలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఏరియా ఇంచార్జి జనరల్ మేనేజర్ డి శ్యామ్ సుందర్(General Manager D. Shyam Sundar) అన్నారు. గురువారం భూపాలపల్లి ఏరియాలో బొగ్గు నాణ్యత వారోత్సవాలు ఘనంగా ప్రారంభం కాగా జీఎం కార్యాలయ ఆవరణలో ఇంచార్జి జీఎం బొగ్గు నాణ్యత పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ రంగంలో పెరుగుతున్న పోటీ నేపథ్యంలో నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి, సరఫరాలో సంస్థకు ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని పేర్కొన్నారు. బొగ్గు నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు సంస్థ ప్రతిష్టను మరింత బలోపేతం చేయవచ్చని తెలిపారు.
నాణ్యత అనేది కేవలం ఒక విభాగానికి సంబంధించిన బాధ్యత కాదని, ప్రతి ఉద్యోగి సమష్టి బాధ్యతతో, నాణ్యతతో సంస్థ పురోబివృద్ధికి పనిచేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగులచే నాణ్యత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం రమణ్ వి పాఠక్, పర్సనల్ మేనేజర్ ఎస్. శ్యామ్ సుందర్, ఏఐటీయూసి నాయకులు మోటపలుకుల రమేష్, ఐఎన్‌టీయూసి నాయకులు బి మధూకర్ రెడ్డి, సిఎంఓఐఏ ప్రతినిధి ప్రదీప్, క్వాలిటి ఇంచార్జి మేనేజర్ కుమారస్వామి ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.