రైతాంగ సమస్యలపై సమరభేరి
ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి
మల్లు లక్ష్మి పిలుపు.. సిరికొండలో ఇంటింటా ప్రచారం
మోతె,(విజయక్రాంతి): రైతుల సమస్యల(Farmers problems) పరిష్కారమే లక్ష్యంగా ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించే అఖిలభారత రైతు సంఘం (All India Farmers' Association) 36వ జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి(AIDWA State Secretary Mallu Lakshmi ) పిలుపునిచ్చారు. గురువారం మోతె మండలం సిరికొండలో ఇంటింటా ప్రచారం ప్రారంభించారు.
రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలని, సమగ్ర రుణమాఫీ అమలు చేయాలని, నకిలీ విత్తనాలు అరికట్టాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే విధానాలను ప్రభుత్వాలు విడనాడాలని అన్నారు. ఈ నెల 15న ఎన్జీ కళాశాల మైదానంలో జరిగే రైతు గర్జన సభకు మాజీ ఎంపీ బృందాకరత్ హాజరవుతారని తెలిపారు.
సీపీఎంలో యువకుడి చేరిక
సిరికొండకు చెందిన నవిలే ఉపేందర్ సీపీఎంలో చేరగా, మల్లు లక్ష్మి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీఐటీయూ మండల నాయకులు కాంపాటి శ్రీను, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు పి.డమర్తి అశోక్, రైతు సంఘం నాయకులు మీసాల వెంకన్న, డీవైఎఫ్ఐ మండల కార్యదర్శి వెలుగు మధు, ఐద్వా మండల నాయకురాలు కాంపాటి నాగమ్మ, బొర్రా మైసయ్య, మామునూరి నారాయణ, వేల్పుల వెంకన్న, కాంపాటి వెంకయ్య, బొర్ర వెంకన్న తదితరులు పాల్గొన్నారు.