కోట గుళ్ళులో సినిమా షూటింగ్

12-11-2026 | 06:34pm

గణపురం నవంబర్ 12 (విజయ క్రాంతి):మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం(Kakatiya art scene) శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం(Sri Bhavani Sahita Ganapeswaralayam) కోటగుళ్లలో గురువారం బబ్లు డబుల్ ఎక్సెల్  సినిమా(Babloo Double XL movie) షూటింగ్ ప్రారంభమైంది.

స్టేట్ ఆర్కియాలజీ అనుమతితో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ యూనిట్ ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం సినిమా షూటింగ్ ప్రారంభించారు.

ఎస్ వి సి ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిర్మిస్తున్న సినిమాకు  డైరెక్టర్ సాయిలు కాంపాటి , నిర్మాత రామ్మోహన్రావు , కెమెరామెన్ వాజిద్ సంగీతం విజయ్ హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్  గాజీ నటిస్తున్న సినిమా షూటింగ్ మొత్తం మూడు రోజులపాటు  కొనసాగనుంది. మొదటిరోజు హీరో హీరోయిన్లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.

మరిన్ని వార్తలు