చలికి జుట్టు డ్రై.. ఇలా చేయండి!

12-11-2026 | 11:58am

చలికాలం వచ్చిందంటే చర్మంతో పాటు జుట్టు సమస్యలు కూడా మొదలవుతాయి. చల్లని గాలులు, గాలిలో తేమ తగ్గడం వల్ల జుట్టు పొడిబారడం, నిర్జీవంగా మారడం, చివర్లు చిట్లిపోవడం వంటి సమస్యలు వేధిస్తుంటాయి. ఎంత జాగ్రత్త తీసుకున్నా జుట్టు పొడిగా, గరుకుగా కనిపిస్తుంటుంది (Winter Hair Care).

అయితే ఖరీదైన జుట్టు సంరక్షణ ఉత్పత్తులు (Hair Care Products) వాడకుండానే ఇంట్లో లభించే కొబ్బరి నూనెతో ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు. ఇందుకోసం చిన్న చిట్కాను పాటిస్తే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి: చలిలోనూ ముఖం మెరవాలా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి!


ముందుగా కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని గోరువెచ్చగా చేసుకోవాలి. అనంతరం ఆ నూనెను జుట్టు పొడవునా, ముఖ్యంగా చివర్లకు సున్నితంగా పట్టించాలి. సుమారు 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయవచ్చు (Coconut Oil Treatment).

ఇలా చేయడం వల్ల జుట్టులో తేమ నిలిచి ఉండటానికి, ప్రోటీన్ నష్టాన్ని తగ్గించడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. క్రమం తప్పకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో జుట్టు పొడిబారకుండా, మృదువుగా ఉండేందుకు దోహదపడుతుంది (Silky Hair).

మరిన్ని వార్తలు