మానసిక ప్రశాంతతే ఆరోగ్య సమస్యలకు అసలైన పరిష్కారం

19-11-2026 | 05:10am

నేటి యువతను వేధిస్తున్న ఆరోగ్య సమస్యలు

నవంబర్ 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం

హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): పురుషుల ఆరోగ్య సమస్యల(Men's health problems) గురించి ఆలోచించినప్పుడు, సాధారణంగా మన చర్చలు పాతకాలపు అపోహలు లేదా సమ స్య వచ్చిన తర్వాత తీసుకునే చికిత్సల చుట్టూనే తిరుగుతుంటాయి. కానీ నేటి యు వతలో నిశ్శబ్దంగా ఒక పెద్ద మార్పు చోటుచేసుకుంటోంది.

యవ్వనం, సంతానోత్పత్తి, లైంగిక ఆరోగ్యంపై దీర్ఘకాలంగా ఉన్న అభిప్రాయాలను సవాలు చేసే విధంగా.. జీవన శైలి వల్ల తలెత్తుతున్న తీవ్రమైన ఆరోగ్య సమస్యలను తాము ఎక్కువగా చూస్తున్నామని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్‌యూ) కన్సల్టెంట్ ఆం డ్రాలజిస్ట్ డాక్టర్ సూరజ్ పిన్ని వంటి నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పురుషు ల్లో ‘సెకండరీ ఇన్ఫెర్టిలిటీ’ (మొదటి సంతా నం కలిగిన తర్వాత, రెండోసారి సంతానం కలగకపోవడం) ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు గుర్తిస్తున్నారు. 

చెడు జీవనశైలి అలవాట్లు, చిన్న వయసులోనే వచ్చే మధుమేహం (డయాబెటిస్), ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధు లు వీర్యకణాల నాణ్యతను తగ్గించి, ఒకప్పుడు సంతాన సామర్థ్యం ఉన్న దంపతుల్లోనూ సంతానలేమికి దారితీస్తున్నాయి. మరోవైపు, కొందరు యువకులు త్వరగా కండరాలు పెంచుకోవాలనే తాపత్రయంతో బాడీబిల్డింగ్ సప్లిమెంట్లు, అనాబాలిక్ స్టెరాయిడ్స్, బయటి నుంచి తీసుకునే టెస్టోస్టె రాన్ ఇంజెక్షన్ల వంటి వాటిని వాడుతూ తమ శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీసుకుంటున్నారు.

కాగా ఔట్-పేషెంట్ విభాగాలకు వచ్చే రోగులలో అంగస్తంభన లోపం, శీఘ్రస్కలనం మధ్య ఉన్న తేడాపై తీవ్రమైన గం దరగోళం నెలకొన్నట్లు వైద్యులు గమనిస్తున్నారు.అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువకులలో మానసిక కారణాల వల్ల కలిగే అంగస్తంభన లోపం  విపరీతంగా పెరుగుతోంది. ఇలాంటి మానసిక అవరోధాలను అధిగమించడానికి హడావుడి వైద్యం, తక్షణ మందుల కంటే.. వైద్యుల ఓపికతో కూడిన మార్గదర్శకత్వం, సరైన అవగాహన, మానసిక మద్దతు ఎంతో అవసరమని నిపుణులు చెబుతున్నారు. అంతిమంగా, పురుషుల అసలైన ఆరోగ్య సంరక్షణ అంటే పైకి కనిపించే శరీర సౌష్టవం, తాత్కాలిక పరిష్కారాలకు అతీతంగా ఆలోచించడమేనని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు