రష్మికలో మరో యాంగిల్.. వీడియో

19-11-2026 | 07:04am

మునుపెన్నడూ చూడని రష్మికను చూపించబోతున్న ‘మైసా’!

ప్రతి సినిమాతో తనలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna).. ఇప్పుడు ‘మైసా’ (MYSAA)తో మరోసారి సర్‌ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా కోసం ఆమె పడుతున్న కష్టం చూస్తుంటే, ఈసారి తనను తాను పూర్తిగా కొత్తగా ఆవిష్కరించుకోవాలనే పట్టుదల కనిపిస్తోంది. ముఖ్యంగా Physical Transformation, ప్రత్యేక శిక్షణపై రష్మిక చూపిస్తున్న శ్రద్ధ ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

ఇప్పటివరకు చేసిన పాత్రలకు భిన్నంగా, శారీరకంగా ఎంతో శ్రమతో కూడుకున్న పాత్రను ఆమె ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ Characterకు తగ్గట్టుగా ప్రత్యేకంగా Training తీసుకుంటూ తనను తాను సిద్ధం చేసుకుంటోంది. కేవలం తెరపై కనిపించడం మాత్రమే కాకుండా, పాత్రలో పూర్తిగా ఒదిగిపోయేందుకు రష్మిక చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ప్రతి చిత్రంలోనూ కొత్త లుక్, కొత్త Performanceతో అభిమానులను ఆకట్టుకునే ఈ బ్యూటీ.. ‘మైసా’తో మరో మెట్టు ఎక్కేలా కనిపిస్తోంది. ఈ సినిమా ఆమె కెరీర్‌లోనే ప్రత్యేకమైన చిత్రంగా నిలిచే అవకాశాలున్నాయనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ కొత్త ప్రయోగంతో రష్మిక ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!

మరిన్ని వార్తలు