ఎండోస్కో పితో క్లిష్ట చికిత్సలు విజయవంతం
- వివరాలు వెల్లడించిన డా. అరుణ్ అరోరా
- రోగుల జీవన నాణ్యతను మెరుగుపర్చడమే మెడికవర్ లక్ష్యం
హైదరాబాద్, అక్టోబర్ 12 (విజయక్రాంతి): జీర్ణకోశ(Digestive system) సంబంధిత క్లిష్టమైన వ్యాధులకు అధునాతన ఎండోస్కోపీ విధానాలతో(Endoscopy procedures) చికిత్స అందిస్తూ, పెద్ద శస్త్రచికిత్సలకు(Major surgery) ప్రత్యామ్నాయాలను అందించడంలో మెడికవర్ హాస్పిటల్స్(Medicover Hospitals), హైటెక్ సిటీ వైద్య బృందం రెండు కీలక విజయాలు సాధించింది. ఇద్దరు రోగులకు కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ అరుణ్ అరోరా పగడపెల్లి నేతృత్వంలో ఎండోస్కోపీ విధానాలతో విజయవంతంగా చికిత్స అందించారు.
తొలికేసులో కోతలు లేకుండా విజయవంతంగా చికిత్స అందించి రోగికి ఉపశమనం కల్పించారు. రెండో కేసులో కణితిని తొలగించి రోగిని 48 గంటల్లోగా డిశ్చార్జీ చేశారు. ఈ సందర్భంగా డా. అరుణ్ అరోరా మాట్లాడు తూ.. ఈ రెండు కేసుల్లోనూ అధునాతన ఎం డోస్కోపి విధానంలోవిజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ విధానం సమర్థవంతంగా ప్రత్యామ్నాయంగా నిలుస్తుందన్నా రు. అవయవాలను సంరక్షించడం, కోలుకునే సమ యాన్ని తగ్గించడం, రోగుల జీవన నాణ్యతను మెరుగుపరచడమే మెడికవర్ హాస్పి టల్ లక్ష్యమని డా.అరుణ్ తెలిపారు.