కామినేని వైద్యుల అరుదైన ఘనత

06-10-2026 | 05:00am

ఛాతీలోకి వ్యాపించిన భారీ కణితి తొలగింపు

హైదరాబాద్, అక్టోబర్ 5: భుజం నుంచి మెడ, ఛాతీలోని మీడియాస్టినమ్ వరకు వ్యాపించిన భారీ క్లావిక్యులర్ ట్యూమర్‌ను(Clavicular tumor) కామినేని హాస్పిటల్స్(Kamineni Hospitals) కింగ్ కోఠి వైద్యులు(King Koti Doctors) విజయవంతంగా తొలగించారు. 62 ఏళ్ల నాగయ్యకు సుమారు 8 గంటల పాటు క్లిష్టమైన శస్త్రచికిత్స(Complex surgery) నిర్వహించారు. సీటీవీఎస్ సర్జన్ డా. ముసునూరు రవి కిరణ్, సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. శివకుమార్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్ డా. సందీప్ శ్రీరామ్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ శస్త్రచికిత్స చేపట్టింది.

శ్వాసనాళంపై తీవ్ర ఒత్తిడి ఉండటంతో అనస్థీషియాలజిస్ట్ డా. చైతన్య, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా. రాకేశ్ బ్రాంకోస్కోపీ సహాయంతో ఇంట్యూబేషన్ చేశారు. కణితి ప్రధాన రక్తనాళాలపై కూడా ఒత్తిడి కలిగిస్తున్న నేపథ్యంలో మల్టీడిసిప్లినరీ చర్చ అనంతరం శస్త్రచికిత్స చేపట్టారు. ప్రస్తుతం నాగయ్య పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నారని, సోమవారం డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు