బుల్‌ రన్‌కు బిగినింగ్‌.. లాభాల్లో దేశీయ మార్కెట్లు

06-10-2026 | 09:46am

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు (Stock Market) మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:20 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 125.53 పాయింట్లు లేదా 0.17 శాతం లాభపడి 72,508.00 వద్ద కొనసాగింది. నిఫ్టీ (Nifty) 28.05 పాయింట్లు లేదా 0.12 శాతం పెరిగి 22,583.80 వద్ద ట్రేడవుతోంది.

మార్కెట్లలో కొనుగోళ్ల మద్దతుతో పలు కంపెనీల షేర్లు లాభాల్లో కదులుతున్నాయి. మీషో లిమిటెడ్, బీఎస్ఈ లిమిటెడ్, ఏంజెల్ వన్ లిమిటెడ్ సంస్థలు టాప్ గెయినర్స్ (Top Gainers) జాబితాలో నిలిచాయి. మరోవైపు బెల్‌రైజ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ లిమిటెడ్, సైయంట్ లిమిటెడ్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతూ టాప్ లూజర్స్ (Top Losers) జాబితాలోకి చేరాయి.

మరిన్ని వార్తలు