పెరుగుతున్న సీవోపీడీ కేసులు
ముందస్తు నిర్ధారణ అవసరమంటున్న వైద్యులు
హైదరాబాద్, నవంబర్ 18(విజయక్రాంతి): ఊపిరితిత్తులకు సంబంధించిన సీఓపీడీ (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) వ్యాధి ఇకపై కేవలం ధూమపానం చేసేవారికే పరిమితం కావడం లేదు. ఇళ్లలో వంట పొగ, బయోమాస్ ఇంధనాల కాలుష్యానికి గురయ్యే మహిళలు, గతంలో క్షయ (టీబీ) బారిన పడిన వారు కూడా ఈ వ్యాధికి గురవుతున్నారు.
‘ప్రపంచ సీవోపీడీ దినోత్సవం’ సందర్భంగా ఎల్బీ నగర్‌లోని కామినేని ఆసుపత్రుల(Kamineni Hospitals) ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణులు (పల్మనాలజిస్టులు) ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేశారు. శ్వాసకోశ లక్షణాలను నిర్లక్ష్యం చేసే ధూమపానేతరుల్లో వ్యా ధిపై అవగాహన, ముందస్తు నిర్ధారణ, సకాలంలో చికిత్స అత్యవసరమన్నారు. కామినే ని ఆసుపత్రుల్లో ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 17 వరకు 1,967 ఇన్‌పేషెంట్, 1, 226 ఔట్‌పేషెంట్.. మొత్తం 3,193 సీవోపీడీ కేసులు నమోదయ్యాయన్నారు.
కామినేని ఆసుపత్రుల సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభాకర్ కంది మాట్లాడుతూ ముందస్తు పరీక్షలు, స్పురైమెట్రీతో వ్యాధిని తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించవచ్చునన్నారు. సీవోపీడీ నిర్ధారణకు ’స్పురై మెట్రీ’ పరీక్ష ఎంతో కీలకమన్నారు. కామినేని ఆసుపత్రుల్లోని మాస్టర్ హెల్త్ చెక్ అప్‌లో స్పురైమెట్రీని భాగంగా చేర్చడంతో పాటు, ఊపిరితిత్తుల పనితీరును లోతుగా అంచనా వేసే ‘డీఎల్సీఓ’ పరీక్ష సదుపాయం ఉందన్నారు. సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఇ. రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ.. కార్డియోథొరాసిక్ సర్జికల్ విభాగం సహకారంతో ఎంపిక చేసిన రోగులకు నిర్వహించే ‘లంగ్ వాల్యూమ్ రిడక్షన్’ శస్త్రచికిత్సలు, శ్వాసకోశ సమస్యల కోసం అత్యవసర చికి త్సలు అందుబాటులో ఉ న్నాయన్నారు.