పట్టభద్రుల ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి
ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచార్జ్ గందె శ్రీనివాస్ గుప్తా
నల్లబెల్లి,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మూడుచెక్కలపల్లి గ్రామం(Mooduchekkalapalli village)లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు(MLC Voter Registration) ప్రక్రియపై ఎన్నికల ఇన్ఛార్జ్ గందె శ్రీనివాస్ గుప్తా, గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ ల ఆధ్వర్యంలో ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చేసుకునేలా గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని నాయకులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు మూడు మాంజిలాల్, ఉప అధ్యక్షులు బోడ సురేష్, ఇన్ఛార్జ్ బానోతు శ్రీను నాయక్, మాజీ అధ్యక్షులు ధరవాత్ భోజ్య నాయక్, ఎంపీ సర్వర్ మియా, వార్డు సభ్యులు ఇస్లావత్ రవీందర్, బానోతు ప్రేమ్ కుమార్, సీనియర్ నాయకులు ఇస్లావత్ నెహ్రూజీ, మూల ప్రశాంత్ రెడ్డి,బానోతు సాయులు, సపావట్ రవి, పబ్బోజు ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.