కోహ్లీ క్రీజులో.. నిలిచిన ఆట

04-11-2026 | 01:04pm

టీమిండియా ఛేజింగ్‌కు బ్రేక్.. వర్షంతో నిలిచిన తొలి వన్డే!

న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి ODIలో టీమిండియా విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వరుణుడు అడ్డుపడ్డాడు. 186 పరుగుల Targetతో బరిలోకి దిగిన భారత్.. వర్షం ఆటంకం కలిగించే సమయానికి 10.5 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరడంతో భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కోహ్లీ 29 పరుగులతో, గిల్ 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో న్యూజిలాండ్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ ముందు స్వల్ప లక్ష్యం నిలిచింది. అయితే ఛేజింగ్ మధ్యలో వర్షం కురవడంతో మ్యాచ్ నిలిచిపోయింది. వాతావరణం సహకరిస్తేనే మిగిలిన ఆట కొనసాగనుంది. దీంతో టీమిండియా విజయంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు