అలక నీలమ్మ కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తమ్ పద్మావతి రెడ్డి
నేరేడుచర్ల, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నేరేడుచర్ల మున్సిపాలిటీ(Nereducherla Municipality) పరిధిలోని ఐదవ వార్డు నర్సయ్య గూడెం గ్రామానికి చెందిన అలక నీలమ్మ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి(MLA Uttam Padmavathi) రెడ్డి శుక్రవారం నీలమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులు అలక సైదిరెడ్డి సరిత, నేరేడుచర్ల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు శ్రవణ్ రెడ్డిని కలిసి వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
ఈ సందర్భంగా నీలమ్మ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డి,5వ వార్డు కౌన్సిలర్ నన్నెపంగ శ్రీనివాస్, 4వ వార్డు కౌన్సిలర్ కొణతం మంజుల, 8వ వార్డు కౌన్సిలర్ లావణ్య, 2వ వార్డు కౌన్సిలర్ యారవ లక్ష్మి, మాజీ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తాళ్ల సురేష్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బచ్చలకూరి ప్రకాష్, చెరువు సంఘం చైర్మన్ యామిని వీరయ్య, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.