అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు

19-09-2026 | 04:44pm

నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ కొణతం చిన్న వెంకట్ రెడ్డి 

నేరేడుచర్ల, సెప్టెంబర్ 19 (విజయ క్రాంతి ): అన్నదానానికి మించిన దానం మరొకటి లేదని నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్ (Municipal Chairman) కొణతం చిన్న వెంకటరెడ్డి,వైస్ చైర్మన్ నూకల సందీప్ రెడ్డిలు అన్నారు. శనివారం నేరేడుచర్ల లోని ఎస్ ఆర్ కె రెసిడెన్సీలో గణపతి నవరాత్రి ఉత్సవాల 6వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ చెన్నబోయిన నాగరాజు తో కలిసి ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు అంటే కేవలం భజనలు, పూజలకే పరిమితం కాకుండా భక్తులకు ఒక్కరోజు అన్నదానం చేయడమంటే సాక్షాత్తు పరమశివుడికి నైవేద్యం పెట్టినట్లేనని అన్నారు. అలాంటి   సాంప్రదాయాన్ని ప్రతి ఏడాది ఎస్ఆర్ కె రెసిడెన్సి వాసులు కొనసాగించడం అభినందనీయమని ప్రశంసించారు.

ప్రశాంతమైన పండగ  వాతావరణంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమానికి సుమారు 2 వేల మంది భక్తులు తరలిరాగా సంతృప్తిగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో ‌అపార్ట్మెంట్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు బోనగిరి.అంజయ్య,చిత్తనూరు రామకృష్ణ,అరిబండి కిరణ్ కుమార్, సుంకరి క్రాంతి కుమార్,కందిబండ హరిప్రసాద్,యీగా శ్రీనివాస రావు,రాచకొండ శ్రీనివాసరావు, రావులపల్లి రోశయ్య, చౌడిశెట్టి వెంకట సూర్యనారాయణ, కురువెళ్ల రవి, శ్రీరామ్ తరుణ్, వేమూరు నరేందర్, యేచూరి శేఖర్, దేవరశెట్టి చిన్న వెంకటేశ్వర్లు, శ్రీరామ్ సత్యనారాయణ, జగిని  శ్రీను, కందిబండ కిరణ్, కుంకు శ్రీనివాస్, ఆండికా రామోజీ, శానం నరసయ్య, గరిణె కామేశ్వరరావు, కర్నాటి  ఆదినారాయణ, గుండా శ్రీను, కట్టమూరి మధు , మహిళలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు