పీఆర్టీయూ కూసుమంచి మండల అధ్యక్షుడిగా శీలం ఆంజనేయులు

19-09-2026 | 05:55pm

ప్రధాన కార్యదర్శిగా ఎం. సతీష్ ఏకగ్రీవ ఎన్నిక

కూసుమంచి, సెప్టెంబర్ 19(విజయక్రాంతి): పీఆర్టీయూ–టీఎస్ కూసుమంచి(PRTU-TS Kusumanchi )మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కూసుమంచిలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించారు. మండల అధ్యక్షుడిగా శీలం ఆంజనేయులు(Seelam Anjaneyulu) , ప్రధాన కార్యదర్శిగా ఎం. సతీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా ఏ. లక్ష్మీనారాయణ, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా సీహెచ్. కృష్ణవేణి, ఉపాధ్యక్షులుగా బి. పాపారావు, సీహెచ్. మురళీమోహన్, మహిళా ఉపాధ్యక్షురాలిగా పి. విజయరూపిణి ఎన్నికయ్యారు.

కార్యదర్శులుగా బి. ఉపేందర్‌రావు, డి. నాగేశ్వరరావు, మహిళా కార్యదర్శులుగా బి. చైతన్య రవళి, కే. వాణి, జె. సునీత, షబానా బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ తమపై విశ్వాసంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న పీఆర్టీయూ కూసుమంచి మండల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, సభ్యులందరినీ సమన్వయం చేసుకుని సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల సంక్షేమం, సంఘ ఐక్యతకు ప్రాధాన్యమిస్తూ నిరంతరం పనిచేస్తామని తెలిపారు.

కార్యక్రమంలో పీఆర్టీయూ–టీఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు కట్టా శేఖర్ రావు, పీఆర్టీయూ మాసపత్రిక ఎడిటోరియల్ సభ్యులు జి. వెంకటరమణ, రాష్ట్ర బాధ్యులు కే. రాజశేఖర్, మల్లికార్జున్, సోమయ్య, అనంత్, జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి చంద్రశేఖర్, సర్వర్ మియా, ఈర్ల కృష్ణతో పాటు పలువురు ఉపాధ్యాయులు, పీఆర్టీయూ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు