బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా దశాబ్ది ఉత్సవాలు
సూర్యాపేట, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : సూర్యాపేట జిల్లా(Suryapet District) ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో. సద్దల చెరువు నుండి కొత్త బస్ స్టాండ్ వరకు 2 కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ జిల్లా ఏర్పాటైన తర్వాత ఊహకందని విదంగా సూర్యాపేట అభివృద్ధి జరిగిందన్నారు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అహర్నిశలు కృషి చేసి జిల్లా కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజి(Medical College), ట్యాంక్ బండ్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎస్అర్ఎస్పీ జలాలు(SRSP Waters) , గురుకులాల ఏర్పాటుతో పాటు నియోజకవర్గంలల్లో రూ. 6 వేల కోట్లతో అభివృద్ధి పనులు జరిపించారన్నారు. ముందుచూపుతో కేసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు అభివృద్ధికి ముఖద్వారాలుగా నిలిచాయన్నారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కంటి ముందు అధికారి, ఇంటి ముందు అభివృద్ధి సమ్మిళితంగా జరిగిందన్నారు.
అధికార వికేంద్రీకరణతో అట్టడుగు వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందాయన్నారు. పిచ్చి తుగ్లక్ పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి ఇవి అర్థం చేసుకోకుండా ఎంతసేపు వ్యక్తిగత ఆరోపణలు, దోచుకోవడం మీదనే ఆయన ధ్యాస ఉందన్నారు. కెసిఆర్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. రేపటి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చివాత పెట్టాలన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ జెడ్ పీ చైర్ పర్సన్ దీపిక యుగేందర్ రావు, హుజూర్ నగర్ నియోజకవర్గ సమన్వయకర్త నరసింహ రెడ్డి, నాయకులు వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.