రంగురంగుల పూలతో.. బతుకమ్మ సంబరాలు.!

10-10-2026 | 08:52pm
  1. కోదాడ బాయ్స్ హైస్కూల్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు
  2. మహిళల ఆటపాటలతో సందడిగా తొలి రోజు సంబరాలు

కోదాడ అక్టోబర్ 10,(విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సంబరాలు కోదాడ పట్టణంలో అంబరాన్నంటాయి. బతుకమ్మ ఉత్సవాల్లో(Bathukamma Festival) భాగంగా తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను పట్టణంలోని బాయ్స్ హైస్కూల్‌లో(Boys High School) మహిళలు ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చిన మహిళలు ఆటపాటలతో సందడి చేశారు.

రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ చేరి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్‌పర్సన్ మల్లేశ్వరి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ఐక్యతకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.

తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలంతా కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ సామినేని ప్రమీల, నూనె సులోచన, శైలజ, గుండెపనేని పద్మ, కాంగ్రెస్ నాయకులు ర రావెళ్ల కృష్ణారావు, మైలర్ శెట్టి భాస్కర్ లైటింగ్ ప్రసాద్ ,కౌన్సిలర్లు కట్టబోయిన శ్రీనివాస్ , ఉదయ్ శ్రీ హరి ప్రసాద్,, కృష్ణ, సామినేని రజిని, తోట శ్రీనివాస్ , గంగమ్మ,సుల్తాని సుజాత, నాగేంద్రమ్మ,తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు