4 September, 2026 | 10:27 PM

Breaking News

హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •   అంజన్న భక్తులకు మెరుగైన మొబైల్ నెట్‌వర్క్   •   సరస్వతీ శిశు మందిర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు   •  

108 సిబ్బందికి ఉచితంగా హెల్మెట్ల పంపిణీ

04-09-2026 | 07:54pm

సరికొప్పుల నాగేశ్వర రావు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని, సేవా కార్యక్రమంలో భాగంగా 108 అంబులెన్స్ సిబ్బందికి ఉచితంగా హెల్మెట్లను అందచేసినట్లు సరికొప్పుల నాగేశ్వర రావు-విజయలక్ష్మి దంపతులు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ,ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రింబవళ్లు సేవలందిస్తున్న 108 అత్యవసర అంబులెన్స్ సిబ్బంది సేవలు ఎంతో గొప్పవని, “సేవే లక్ష్యం” అనే స్ఫూర్తితో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న 108 సిబ్బందికి వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని చిన్న కానుకగా ఈ హెల్మెట్లను అందిస్తున్నామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ సేవా స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొమ్మరాజు శ్రీను, అంజి, అర్జున్, లక్ష్మణ్, వెంకన్న, పాషా కార్యకర్తలు, మరియు 108 సిబ్బంది పాల్గొన్నారు.