4 September, 2026 | 10:38 PM

Breaking News

మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •   భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత   •   కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం   •   420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్   •  

420 హామీలతో మోసం చేసిన కాంగ్రెస్

04-09-2026 | 09:41pm

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే

నిజాంసాగర్,(విజయక్రాంతి): 420 హామీలతో గద్దె నెక్కి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మోసం చేసిందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Former MLA Hanmant Shinde) పేర్కొన్నారు. శుక్రవారం నాడు బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిజాంసాగర్ మండల(Nizamsagar Mandal) కేంద్రంలో నీ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన మహిళా సదస్సు, వంటా వార్పు కార్యక్రమం(Vantavarpu program)లో ఆయన మాట్లాడుతూ...  మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.

ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ(Congress Party)  ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు అన్నారు. ప్రజా కంటక పాలన సాగిస్తున్న ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు. కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్  దఫిదర్ రాజు, నాయకులు గంగారెడ్డి, దుర్గారెడ్డి, సాదుల సత్యనారాయణ, వాజిద్ అలీ, నరసింహారెడ్డి, విట్టల్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పిట్ల సత్యనారాయణ, మేకల విజయ్, అహ్మద్ హుస్సేన్, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.