భక్తి, ఆధ్యాత్మికతతోనే సమాజంలో ఐక్యత
శ్రీ కాత్యాయని సమేత సిద్దేశ్వర స్వామి ప్రతిష్ఠ మహోత్సవంలో వంగ రాజేశ్వర్ రెడ్డి..
సిద్దిపేట రూరల్: పట్టణంలో నిర్వహించిన శ్రీ కాత్యాయని సమేత సిద్దేశ్వర స్వామి(Sri Katyayani Sametha Siddheswara Swamy) ప్రతిష్ఠ మహోత్సవంలో వంగ రాజేశ్వర్ రెడ్డి(Vanga Rajeshwar Reddy) ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సులతో సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షించారు.
ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తి భావనతో పాటు ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రతిష్ఠ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, పెద్దలు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.






