4 September, 2026 | 10:49 PM

Breaking News

అబద్దాల కాంగ్రెస్ ని తరిమి కొట్టండి   •   ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •  

కేసిఆర్ హయాంలోనే కొనసాగిన చక్కటి ప్రభుత్వం

04-09-2026 | 09:46pm

బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి 

ఘట్ కేసర్,(విజయక్రాంతి): కేసిఆర్(KCR) హయాంలోనే తెలంగాణలో చక్కటి ప్రభుత్వం కొనసాగిందని బిఆర్ఎస్ పార్టీ(BRS Party) రాష్ట్ర నాయకులు చామకూర భద్రారెడ్డి అన్నారు. పోచారం డివిజన్‌లోని అన్నోజిగూడ వికలాంగుల కాలనీ వద్ద శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల విఫల పాలనకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమం(Vantavarpu program)లో బిఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు చామకూర భద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యలపై తనదైన శైలిలో బలమైన గళాన్ని వినిపించారు. ముఖ్యంగా వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లు పెంచుతామని ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజా సమస్యలపై భద్రారెడ్డి చూపిస్తున్న చొరవ, ఆయన ప్రసంగం కార్యక్రమంలో పాల్గొన్న వారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది.